బండ్లగూడ ఎంఐఎం పార్టీకి చెందిన దర్గా కార్పొరేట్ అస్లాం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 100 మంది తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే తన ప్రసంగంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. పేద, బడుగు, మైనారిటీ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో బండ్లగూడ నగర మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ సాగర్ గౌడ్, సహకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
