
ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ మ్యాన్ పిఎల్సి కీలక నిర్ణయం తీసుకుంది. 240 సంవత్సరాలలో మొదటి మహిళా CEO గా రాబిన్ గ్రూను నియమించింది. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ల్యూక్ ఎల్లిస్ సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేసిన తర్వాత రాబిన్ గ్రూ బాధ్యతలు స్వీకరించనున్నారు.
1783లో లండన్లో స్థాపించబడిన ఈ సంస్థ 200 సంవత్సరాలకు పైగా రాయల్ నేవీకి రమ్ మరియు చక్కెరను సరఫరా చేసింది. ప్రస్తుతం ఆర్థిక సేవల పరిశ్రమలో పనిచేస్తున్నారు.
