
నందిపేట మండలంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సర్పంచ్‌లతో అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే మన ప్రచారం కావాలి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, గ్రామ ప్రగతి, ప్రజా జీవన ప్రమాణాల పెంపుదల సీఎం కేసీఆర్ ఆశయం.ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి ముందుకు సాగుదాం
మీ గ్రామంలో ఇంకా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి.
వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఎంతైనా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చేపట్టిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. మా గ్రామం అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా కావాలి. మన పథకాల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించాలి. సర్పంచ్‌లు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధిపై ప్రచారం చేయాలి. ప్రజలను ఓట్లు అడిగే హక్కు మనకు తప్ప ఎవరికీ లేదు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా’ అని జీవన్‌రెడ్డి అన్నారు.
