
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా పేదల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని గన్ ఫౌండ్రీ డివిజన్ నేతాజీ కమ్యూనిటీ హాల్, జాంబాగ్ డివిజన్ సుబాన్ పురా కమ్యూనిటీ హాల్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, గోసమహల్ బీఆర్‌ఎస్ ఇంచార్జి నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ బస్తీ దవాఖానలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారని, ఇప్పుడు ప్రభుత్వాసుపత్రులకు క్యూ కడుతున్నారని అన్నారు. ప్రభుత్వ హయాంలో రూ.వేలు వెచ్చించే పరీక్షలు ఉచితం అన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. బస్తీ దవాఖానల ఏర్పాటు వల్ల గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు. మరో రెండు మూడు రోజుల్లో 14 బస్తీ ఫార్మసీలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
