
హైదరాబాద్: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఎంపికైనట్లు సమాచారం. రేపు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కీలక శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా డీకే శివకుమార్‌కే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీకే శివకుమార్ కూడా కర్ణాటక కాంగ్రెస్ చైర్మన్‌గా కొనసాగాలని యోచిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్షం రేపు సమావేశం కానుంది. సీఎల్పీ సమావేశంలో సిద్ధరా మయిని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నట్లు సమాచారం.
