హిమాన్షు రావు | ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షురావు బుధవారం ఉదయం స్నేహితులతో కలిసి నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతిని దర్శించుకున్నారు.

నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర సరస్వతిని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షురావు తన స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, బీఆర్‌ఎస్ బృందం గోదావరి వంతెన వద్ద హిమాన్సుకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఆలయం వద్ద హిమాన్సుకు ఆలయ పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయాల్లో కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. మహంకాళి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు పయనమయ్యారు.
