
హైదరాబాద్: రాష్ట్రంలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. రానున్న రోజుల్లో ఎండలు మరింత బలపడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 31 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, రెండు వారాల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారికంగా సూచించింది.
ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య…రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్నారు. వరంగల్ జిల్లాలో బుధవారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రవ్యాప్తంగా (బుధవారం) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నల్గొండ జిల్లాలో 44.8, ఖమ్మంలో 43.2, ఆదిలాబాద్‌లో 41.3, భద్రాచలంలో 42.8, హనుమకొండలో 41, హైదరాబాద్‌లో 39.5, మహబూబ్‌నగర్‌లో 40.8, మెదక్‌లో 40.8, నిజామాబాద్‌లో 40.9, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
