నైరుతి రుతుపవనాలు | నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరుకున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న మూడు రోజులపాటు తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ద్రోణి శుక్రవారం తూర్పు మధ్యప్రదేశ్ నుండి విదర్భ మీదుగా కర్ణాటక వరకు 0.9 కి.మీ ఎత్తులో విస్తరించింది. వాయువ్య దిశ నుంచి తెలంగాణలోకి తక్కువస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 39 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
