భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంకు చెందిన పదమూడేళ్ల నిహారిక గుండెపోటుతో మృతి చెందింది. నిహారిక తనకు కడుపు నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలికను మణుగులులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కుప్పకూలింది. నిహారికను పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. తమ కూతురు చిన్నప్పుడే గుండెపోటుతో చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
The post భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి appeared first on T News Telugu.
