ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పశ్చిమ బీహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి కారణంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
The post తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా వర్షాలు appeared first on T News Telugu.
