భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ప్రధాన బాధ్యతలు చేపట్టనున్నాడు. గంగూలీని త్రిపుర టూరిజం అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత్ చౌదరి కోల్‌కతాలోని గంగూలీని ఆయన నివాసంలో కలుసుకుని తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు. వారి ఆఫర్‌ను గంగూలీ అంగీకరించాడు.
సౌరవ్ గంగూలీ భాగస్వామ్యం త్రిపురలో పర్యాటకాన్ని ఖచ్చితంగా పెంచుతుందని త్రిపుర సీఎం మాణిక్ సాహా అన్నారు.
