సీఎం కేసీఆర్ నేతృత్వంలో నేడు సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు పాల్గొంటారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, 9వ తెలంగాణ హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇంటి పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, వివిధ శాఖల మంత్రులను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సచివాలయం ఏర్పాటైన తర్వాత కలెక్టర్లతో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం.
