సికింద్రాబాద్:- అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ భగాయత్‌లో 2 ఎకరాల భూమిని జైన సేవా సంఘానికి ప్రభుత్వం కేటాయించింది. భూ మంజూరు పత్రాలను సంఘం ప్రతినిధులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నివసించే ప్రతి ఒక్కరూ మన బిడ్డలే. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వివిధ రంగాల్లో గొప్ప అభివృద్ధిని సాధించింది. ఈడీ, సీబీఐతో కేంద్ర ప్రభుత్వం ప్రతి పక్షాన్ని వేధిస్తోంది. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. దేశంలో కేసీఆర్ కంటే పెద్ద హిందువులు లేరన్నారు. యాదాద్రి దేవాలయం చరిత్రలో నిలిచిపోయే గొప్ప కట్టడం. కేంద్ర ప్రభుత్వం వ్యాపారులను ఇరుకున పెడుతుందని మంత్రి తలసాని అన్నారు.
సికింద్రాబాద్‌లోని ఎస్‌విఐటి హాల్‌లో ఉప్పల్ భగాయత్‌కు కేటాయించిన 2 ఎకరాల భూమికి సంబంధించి జైన్ సేవా సంఘ్‌కు గ్రాంటు పట్టా లభించింది. pic.twitter.com/xKVb0UnBj1
— తలసాని శ్రీనివాస్ యాదవ్ (@YadavTalasani) మే 27, 2023
