అమెరికాలో మరో కాల్పులు. న్యూ మెక్సికోలోని రెడ్ రివర్ ప్రాంతంలో వార్షిక మెమోరియల్ డే వారాంతపు మోటార్‌సైకిల్ ర్యాలీలో ముష్కరుడు కాల్పులు జరిపాడు.
రెడ్ రివర్ మేయర్ లిండా కాల్హౌన్ మాట్లాడుతూ కాల్పుల్లో ముగ్గురు మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూ మెక్సికో స్టేట్ పోలీసులు తెలిపారు.
మోటార్‌సైకిల్ ర్యాలీ షూటింగ్లో పాల్గొన్న వారు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారని మేయర్ లిండా కాల్హౌన్ తెలిపారు. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
అమెరికాలో మోటార్ సైకిల్ ర్యాలీపై కాల్పులు..! appeared first on T News Telugu
