తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు, వడగాలులు వీచే అవకాశం ఉంది.
ఈ కారణంగా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మంగళవారం నాడు చాలా చోట్ల పొడి వాతావరణం ఉండే సూచనలు కనిపిస్తున్నాయని, పలు చోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన జల్లులు కురిశాయని వర్గాలు తెలిపాయి. ఎల్లో వార్నింగ్ జారీ చేశారు.బుధవారం నుంచి శనివారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం వికారాబాద్, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.
