సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని రంగాల అధికారులు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులతో జాతీయ అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్లుగా ఆయా గ్రామాలలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలిసేలా పండుగను నిర్వహించాలన్నారు.
