ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా డ్రగ్స్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 34 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో రెండు (ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఎర్రగడ్డ, గాంధీ దవాఖాన), మరికొన్ని జిల్లా ఫార్మసీలు లేదా జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.
