పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ 2023-24 విద్యా సంవత్సరానికి గాను పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా మరియు సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ల ప్రవేశ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటీసు ప్రకారం, శిల్పం, పెయింటింగ్, డిజైన్, లైబ్రరీ సైన్స్, సంగీతం, నాటకం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా మొదలైన కోర్సులలో ప్రవేశం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 16లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తెలిపారు. ఆలస్య రుసుములకు లోబడి జూన్ 30లోగా యూనివర్సిటీకి సమర్పించాలి.
అర్హత గల అభ్యర్థులు 2023-24 విద్యా సంవత్సరానికి భాషాశాస్త్రం, సంగీతం, నృత్యం, నాటకం, జానపదం, జర్నలిజం, చరిత్ర, సంస్కృతి, ఆర్కియాలజీ, జానపదాలలో PhD ప్రోగ్రామ్‌లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే www.teluguuniversity.ac.in, www.pstucet.org వెబ్సైట్లో లాగిన్ కావాలి.
The post పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ appeared first on T News Telugu.
