రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ పదేళ్ల వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ బోయినపల్లి అంబేద్కర్ మార్కెట్ యార్డులో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతులను ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయని మంత్రి తెలిపారు. రైతే రాజు సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటుతో రైతులకు ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నామన్నారు. రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో బోయిన్ పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ హారిక ఆనంద్ గౌడ్, బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేశ్, కంటోన్మెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
