మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ముంబై: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కారు నాగ్‌పూర్ నుంచి నాగ్‌బీడ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌కు తరలించారు. ఇఘనతపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
