రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శకంగా లైసెన్సులు మంజూరు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలకు మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. యూఎస్‌లో కూడా టీఎస్ ఐపాస్ లాంటి వ్యవస్థ లేదన్నారు. మానవ చరిత్రలో మూడో అతిపెద్ద ప్రణాళిక మన హరితహారం పథకమని అన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
గ్రామీణ, పట్టణాభివృద్ధి కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాలకు ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదేళ్లలో 60 అసంపూర్తి పనులు చేసి చూపించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు గుణపాఠం చెబుతోందని అమెరికా ఇంజినీర్లు అంటున్నారు. ఇది తెలంగాణకు దక్కిన గౌరవమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
The article అమెరికాలో కూడా TS iPass లాంటి వ్యవస్థ లేదు appeared first on T News Telugu.
