ఇళ్లు లేని పేదలకు ఆశ్రయం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల టౌన్షిప్లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను గురువారం మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నారు. ఎర్రగుట్ట, జడ్చర్లలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయింపులకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ మృగశిర కార్తె సందర్భంగా లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేస్తారన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కావున ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
