సీఎం కేసీఆర్ ఈ నెల (జూన్) 9వ తేదీన మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డిలు కొబ్బరికాయలు కొట్టి బహిరంగ సభ పనులను ప్రారంభించారు. బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ నెల 9న మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ నూతన భవన ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో 9వ తేదీ ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లింపు ప్రారంభించామని, దీంతో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.
గోదావరిఖని, చెన్నూరు నుంచి మంచిర్యాలకు వెళ్లే వాహనదారులు క్యాత్నపల్లి గాంధారి వనం నుంచి మంచిర్యాల వరకు వెళ్లి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని పోలీసు అధికారులు తెలిపారు. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్, చెన్నూరు, గోదావరిఖని వైపు వెళ్లే వాహనదారులు మంచిర్యాల ఐబీ ప్లాజా, శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి క్యాత్నపల్లి గాంధారి వనం సమీపంలోని జాతీయ రహదారి ఇంటర్‌చేంజ్‌లో వెళ్లాలని సూచించారు.
