2023-24 విద్యా సంవత్సరానికి గాను మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మంత్రి గంగుల మాట్లాడుతూ బీసీలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గత విద్యా సంవత్సరంలో నూతనంగా డిగ్రీ కళాశాలను నెలకొల్పారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలను https://mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా 14 డిగ్రీ కళాశాలల్లో స్థలాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
