మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ లో మున్సిపల్ పార్కు, ఓపెన్ వ్యాయామశాలను ప్రారంభించారు.

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ లో మున్సిపల్ పార్కు, ఓపెన్ వ్యాయామశాలను ప్రారంభించారు. అనంతరం మూసాపేట మండలం, మహబూబ్‌నగర్‌లో వేముల వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. ముందుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బుత్పూర్కు చేరుకున్న మంత్రి కేటీఆర్, మల్లారెడ్డికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రి గువ్వల బాలరాజు స్వాగతం పలికారు.
అనంతరం మూసాపేట మండలం వేములలోని ప్రైవేట్ కంపెనీ యూనిట్, మైక్రో రూరల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి, మహబూబ్‌నగర్‌లో బాలికల ఐటీఐకి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రగుట్ట, జడ్చర్లలో రెండు పడక గదుల ఇంటిని ప్రారంభించి లబ్ధిదారులకు గృహ ప్రవేశం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు.



