నైరుతి రుతుపవనాలు |గత వారం రోజులుగా విజృంభిస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్లోకి ప్రవేశించాయి. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది.

నైరుతి రుతుపవనాలు |గత వారం రోజులుగా విజృంభిస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్లోకి ప్రవేశించాయి. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాలు లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. వారం రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 కంటే ముందే దేశంలోకి ప్రవేశిస్తాయి. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వారం ఆలస్యంగా దేశానికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అలప్పుజా, ఎర్నాకులంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో చక్రీయత బలహీనపడిందని పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.

