హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించే చేపలు, ఆహారోత్సవాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. వివిధ రకాల చేపలు, రొయ్యల వంటకాల స్టాళ్లను మంత్రి తలసాని సందర్శించి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ కంటే ముందు దేశాన్ని పాలించిన నేతలు, రాజకీయ పార్టీలు మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించాయని మంత్రి తలసాని మండిపడ్డారు. తెలంగాణ మత్స్యకారులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలు అమలు చేస్తోందని, పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరారు.
కార్యక్రమంలో శాసనమండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధార్ సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం పాల్గొన్నారు.
The post మంత్రి తలసాని ప్రారంభించిన ఎన్టీఆర్ స్టేడియం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ appeared first on T News Telugu.
