రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది.
సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల ప్రాంతాల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ కారణంగా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, నాగర్కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు…! appeared first on T News Telugu
