తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నివేదికల ప్రకారం, నేటి (శనివారం) నుండి ఆగ్నేయ ద్వీపకల్పం దిశలో ఈశాన్య రుతుపవనాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ఈ నెల 31, 1 తేదీల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
నవంబర్ 1వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. 15 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో కనిష్టంగా 12.5 డిగ్రీలు నమోదైంది.