ములుగు జిల్లా BRS పార్టీ చైర్మన్, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, జెడ్పీ చైర్మన్ జగదీష్ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగదీష్ మృతి పట్ల సీఎం సంతాపం తెలిపారు. దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా జగదీష్ చురుకైన పాత్ర పోషించారని సీఎం గుర్తు చేశారు. ములుగు జిల్లా పార్టీ చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా జగదీష్ సేవలందిస్తున్నారని సీఎం కొనియాడారు. జెడ్పీ చైర్మన్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ తెలిపారు.
