పదేళ్ల వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పదేళ్ల వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది సహా 1000 మందికి తక్కువ కాకుండా పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని, మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు హాజరవుతారు.

