హైదరాబాద్: బోయింపలిలో విషాదం నెలకొంది. కుటుంబ పెద్ద మృతి చెందడంతో మనస్తాపానికి గురైన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరిలో ఒక కుటుంబం నివసిస్తోంది. ఈ క్రమంలో కుటుంబ పెద్ద చనిపోతాడు. తండ్రి చనిపోవడంతో మనస్తాపం చెంది తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతులను తల్లి విజయలక్ష్మి, కుమార్తెలు చంద్రకళ, సౌజన్యగా గుర్తించారు. ఎంబీఏ చదువుతున్న కుమార్తెలు చంద్ర కళ, వికలాంగురాలు సౌజన్య ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ముగ్గురు ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తూర్పు గోదావరికి తరలించారు.
