ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేనివిధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమంలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. గత తొమ్మిదేళ్లలో 13,90,636 మంది శిశువులు కేటీఆర్ కిట్‌ల ద్వారా లబ్ధి పొందారు. 6.84 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహారం అందజేయగా, 18,46, 635 మంది మహిళలకు అమ్మ ఒడి పథకం అందిందని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు.
