ఢిల్లీ : తెలంగాణ మరో ఘనత సాధించింది. ప్రజా ఫిర్యాదులు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ కరెక్షన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) నెలవారీ నివేదికను మే నెలలో విడుదల చేసింది.
15 వేల లోపు ఫిర్యాదుల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 2,633 ఫిర్యాదులు మాత్రమే నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 72.49 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 55.75 స్కోర్‌తో ఛత్తీస్‌గఢ్, 49.69 స్కోర్‌తో ఉత్తరాఖండ్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదులను సగటున 8 రోజుల్లో పరిష్కరిస్తుందని నివేదిక స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా పోస్టల్ భద్రత.. తెలంగాణ నంబర్ వన్..! appeared first on T News Telugu
