సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో రూ.630 కోట్లతో నిర్మించిన ఐటీ భవనాన్ని మంత్రి హరీశ్ రావు, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్ నాన్ వెజ్ వెజిటబుల్ మరియు పంచాయత్ రాజ్ సెక్టార్ సేంద్రీయ ఎరువుల స్టాళ్లను ఏర్పాటు చేసి ఇర్కోడ్ రూ.6 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆధునిక కబేళాశాలను మంత్రులు ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో బిటి, సిసి రోడ్లు, నర్సాపూర్ లో కప్పలకుంట సుందరీకరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, రీజినల్ కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

The post ఐటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ appeared first on T News Telugu.
