తెలంగాణ రాష్ట్ర పదేళ్ల వేడుకల్లో భాగంగా శిల్పకళావేదికలో పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జీహెచ్‌సీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, బాల్క సుమన్, కాలె యాదయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి నివేదికను విడుదల చేశారు. హైదరాబాద్ మహానగర ప్రగతి నివేదికను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. పట్టణ ప్రగతి, పట్టణాభివృద్ధి, హైదరాబాద్ వర్ధమాన నగరంపై షార్ట్ ఫిల్మ్ ను వీక్షించారు.
