హైదరాబాద్: తిరుమల శ్రీవారికి అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
కోవిడ్ కారణంగా, అధిక మాసం నేపథ్యంలో 2020లో TTD రెండు వేర్వేరు బ్రహ్మోత్సవాలను నిర్వహించింది. అనంతరం ఈ ఏడాది అధిక మాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలు భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
The post ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు appeared first on T News Telugu.
