హైదరాబాద్: నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో పెద్దఎత్తున అనిసోల్ సల్ఫేట్ ఇంజక్షన్ పట్టుబడింది. 400 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టెపల్లి, దుర్గానగర్ కూడలిలో ఫిట్‌నెస్ శిక్షకులు నితీశ్, రాహుల్, సోహెల్ డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
జిమ్‌లలో బాడీబిల్డర్లు ఈ ఇంజెక్షన్లను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనంపై పోస్ట్…! appeared first on T News Telugu
