ఈరోజు నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయి ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా, 28 మంది గల్లంతయ్యారు.
వరదల కారణంగా మరణించిన వారి సంఖ్యపై నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దహల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ప్రధాని ఆదేశించారు.
