కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం “దేవర”. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నెంబర్ వన్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం “దేవర”. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నెంబర్ వన్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా వార్తల ప్రకారం హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న భారీ సెట్లో పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ మధ్య జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. చిత్ర నేపథ్యం నిర్లక్ష్యానికి గురైన తీర ప్రాంతం. ఎన్టీఆర్ పాత్ర మృగమైన మనిషి నుండి తన ప్రజలను రక్షించే హీరోగా ఉంటుందని, ఇది చాలా శక్తివంతమైన పాత్ర అని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కోనరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది.

