తెలంగాణ విద్యా రంగం దేశానికే దిక్సూచిగా మారిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లార్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో పదేళ్ల వేడుకల్లో భాగంగా జరిగిన విద్యా దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మకమైన ప్రగతిని సాధించిందన్నారు.
దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా జరిగిన అన్ని పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించి తెలంగాణ భాషా పటిమను ప్రదర్శించారని కొనియాడారు. ముఖ్యమంత్రి కృషి వల్ల ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. మన ఊరు-మనబడి పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరిగాయని వెల్లడించారు.
