వైద్య విద్యలో చేరేటపుడు ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్ల కోటా కింద పీజీ మెడికల్ సీట్లను కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కోయలా రూత్ జన్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకరాంజీ విచారించారు.

హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య ప్రవేశాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్ల కోటా కింద పీజీ మెడికల్ సీట్లను కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కోయలా రూత్ జన్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకరాంజీ విచారించారు. ఎన్‌ఎంసి న్యాయవాది పూజిత మాట్లాడుతూ రిజర్వేషన్లపై జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసి) నిర్ణయం తీసుకునే స్థితిలో లేదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రవీణ్‌కుమార్ స్పందిస్తూ.. మార్గదర్శకాలను ఉంచేందుకు ఎన్‌ఎంసీ సిద్ధంగా ఉంటే.. దానిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌కు ఎస్సీ కోటా లేదా ఓబీసీ కోటాలో లేదా ట్రాన్స్‌జెండర్ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలనే ప్రశ్నను పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది.

