రేపు (గురువారం) హైదరాబాద్‌లో ఆషాడ బోనస్‌లు ప్రారంభం కానున్నాయి. ముందుగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొని… రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
లక్షలాది మంది భక్తులు బోనాలకు తరలివస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
