రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎక్కడికక్కడ వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
అలాగే గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో రోజంతా ఎండలు మండిపోతుండగా.. రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. నగరవాసులు వేడి మరియు గాలి నుండి ఉపశమనం పొందారు మరియు చల్లని గాలి తాకింది. మరోవైపు నల్గొండ, నాగర్ కర్నూల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ వివరించింది.
