హైదరాబాద్: మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ కాంప్లెక్స్‌లో జరిగే అఖిలపక్ష సమావేశానికి జాతీయ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరుకానున్నారు.
ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో వినోద్‌కుమార్ బీఆర్ఎస్ తన వంతు పాత్ర పోషిస్తారని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు.
