
హైదరాబాద్, క్రీడా ప్రాతినిధ్యం: దీపక్ గోయల్-విజయ్ అగర్వాల్ జోడీ ఫ్రెండ్ షిప్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ సెంటర్లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దీపక్-విజయ్ ద్వయం 8-5తో చంద్రశేఖర్-అజయ్ రాయ్‌పై విజయం సాధించింది.
విజేతలకు హైకోర్టు న్యాయమూర్తి, న్యాయమూర్తి విజయసేన్‌రెడ్డి గౌరవ అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫతేమైదాన్ క్లబ్ కమిటీ సభ్యులు విజయ్ రాజ్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
