హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో చాలా చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ప్రస్తుతం అంబర్ అలర్ట్ ప్రకటించారు.
