హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ సీట్లను రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ ఖరారు చేసింది. రాష్ట్రంలోని 137 ప్రైవేట్ కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని వెల్లడించారు. 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,713 ఇంజినీరింగ్ సీట్లు, రెండు ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,302 సీట్లు ఉన్నాయి.
ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 ఇంజినీరింగ్ సీట్లు ఉంటాయి. సీఎస్‌ఈలో 15,897 సీట్లు, ఈసీఈలో 9,734 సీట్లు ఉన్నాయి. రేపటి నుంచి ఇంజినీరింగ్ వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్టేట్ కౌన్సిల్ ఉన్నత విద్యా కమిషన్ పేర్కొంది.
The post రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు ఖరారు appeared first on T News Telugu
