తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్రలోని తుల్జాపూర్లో కొలువుదీరిన తూజాను మంగళవారం దర్శించుకున్నారు · తుల్జా భవాని అమ్మవారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో భవానీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సర్కోలిలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి తుజాపూర్ ఆలయానికి చేరుకున్నారు.
ఉదయం పండరీపురం రుక్మిణీ సమేత విఠలేశ్వర స్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.
