తెలంగాణ గవర్నర్ చేసిన పని గుడ్డులో నుంచి ఈక లాగేసినట్లుందని ఆరోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గవర్నర్ తన పదవి గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ గవర్నర్ ఉస్మానియా ఆస్పత్రిపై మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 2015లో కేసీఆర్ ప్రభుత్వం ఉస్మానియాలో ఆసుపత్రి కట్టడం, కొత్త భవనాలు కట్టడం కుదరదని తేల్చిచెప్పితే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటాయన్న విషయం గవర్నర్ కు తెలిసి ఉండాలన్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఉస్మానియా ఆస్పత్రిపై తొలుత సీఎం కేసీఆర్ మాత్రమే స్పందించారు.
స్వతంత్ర కమిషన్ కూడా భవనం సాధ్యం కాదని చెప్పింది. అయితే కొందరు ప్రతిపక్ష నేతలు కోర్టును ఆశ్రయించారు. కంటి వెలుగు కార్యక్రమానికి మన ఆశా సిబ్బంది, వైద్యులు చేస్తున్న కృషిని అభినందించే హృదయం గవర్నర్‌కు ఎందుకు లేదు? మాతాశిశు మరణాల తగ్గింపును నీతి ఆయోగ్ అభినందిస్తుంటే, దానిని అభినందించే హృదయం మీకు ఎందుకు లేదు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% నుంచి 70% ప్రసవాలు జరుగుతున్నాయంటే ఎందుకు కృతజ్ఞత చూపకూడదు? జిల్లాలో వైద్య పాఠశాలను నెలకొల్పి జాతీయ రికార్డు సృష్టించారు. మంచి పనులను మెచ్చుకోవడం లేదా?
ఉస్మానియా ఆస్పత్రిలో అవయవ మార్పిడి జరుగుతోంది. మీరు ఇంత మంచి పని చేస్తుంటే, మా వైద్యులు మరియు సిబ్బందికి ఎందుకు ధన్యవాదాలు చెప్పకూడదు? బస్తీ ఫార్మసీ తెరుచుకుంది. బస్తీ క్లినిక్ ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ ఆస్పత్రుల్లో ఓపీని తగ్గిస్తుంది. నిమ్స్‌లో 2000 పడకల కొత్త భవనం బాగుందని ఎందుకు ట్వీట్ చేయడం లేదు? ఇంత పెద్ద అభివృద్ధి జరుగుతున్నా గవర్నర్ ఎందుకు చూడలేకపోతున్నారు? బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడితే రాజకీయంగా ఎదుర్కొంటాం. కానీ రాజ్యాగం చేసేటపుడు ఇలాంటి మాటలు అనడం సరికాదని, పదవికి ఇంత విలువ ఇవ్వాలి. చెడు మాత్రమే చూడగలం, వినగలం, చెడు మాట్లాడగలం అని మీరు తీర్పు చెప్పారా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులు గవర్నర్‌కు కనిపించడం లేదా? appeared first on T News Telugu
